బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (12:17 IST)

శ్రీనువైట్ల భావోద్వేగం... బరువెక్కిన హృదయంతో వీడ్కోలు.. వీడియో వైరల్

Srinuvaitla
Srinuvaitla
టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల, కాస్ట్యూమ్ డిజైనర్ రూప దంపతులకు ముగ్గురు కుమార్తెలన్న సంగతి తెలిసిందే. వీరిలో పెద్దకుమార్తె అమెరికాకు చదువుల కోసం బయల్దేరింది. ఎయిర్ పోర్టులో కుమార్తెకు బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలుకుతున్న వీడియోను శ్రీను వైట్ల పంచుకున్నారు. 
 
"అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేసేందుకు నా పెద్ద కూతురు అమెరికా వెళ్లింది. ఓ తండ్రిగా ఎంతో వేదన కలిగింది. ఇదే వయసులో నేను చెన్నై వెళుతుంటే ఆనాడు మా నాన్న ఎంత బాధపడి ఉంటాడో ఇప్పుడు అర్థమవుతోంది. జీవితం ఓ చక్రంలాంటిది. నా గారాలపట్టి ఆనంది తండ్రిని గర్వించేలా చేస్తుందని గట్టి నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు.