సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్‌లో చిత్రం షూటింగ్ ప్రారంభం
Suriya, Siva, jnavel raja and ohters
విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వర్సటైల్ స్టార్ సూర్య.. మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన శివ కాంబినేషన్‌లో నూతన చిత్రం ప్రారంభమైంది. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మొదటి నుంచి కమర్షియల్ తో పాటు వినూత్నమైన కథలను ఎన్నుకుంటూ.. మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, బాగమతి లాంటి ఎన్నో విజయాలతో అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది యూవీ క్రియేషన్స్. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా యూవీ క్రియేషన్స్ సత్తా చూపించింది. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో సూర్య, అగ్ర దర్శకుడు శివ కాంబినేషన్‌లో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ నెం 25గా యువి క్రియేషన్స్‌తో సంయుక్తంగా ఒక భారీ ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. చిత్ర యూనిట్‌తో పాటు అతిరథ మహారధుల సమక్షంలో ఓపెనింగ్ జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
టెక్నికల్ టీమ్:దర్శకుడు: శివ, బ్యానర్స్: స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ, ప్రమోద్ జ్ఞానవేల్ రాజా, విక్రమ్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్