1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Govt made Key announcement on Vinayaka Chavithi Permissions

వినాయకచవితి మండపాల విద్యుత్ బిల్లలుపై ఏపీ సర్కారు కీలక ప్రకటన

Vinayaka
ఈ నెల 30వ తేదీన దేశ వ్యాప్తంగా వినాయకచవితి పండుగ జరుగనుంది. ఇందుకోసం దేశ యావత్తూ ముస్తాబవుతుంది. అయితే, ఈ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసే వినాయక మండపాలకు కరెంట్‌ను వినియోగిస్తే విద్యుత్ బిల్లులు చెల్లించాలనే ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం సోమవారం క్లారిటీ ఇచ్చింది. 
 
వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు.
 
వియానక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు, వాటివద్ద ఏర్పాటు చేసే మైక్ సెట్‌లకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందన్నారు. 
 
కానీ, ఇందులో రవ్వంత కూడా నిజం లేదన్నారు. మండపాల ఏర్పాటుకు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా డిమాండ్ చేస్తే స్థానిక పోలీసులు లేదా రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాలని ఆయన సూచించారు. 
తర్వాతి కథనం
కుమార్తెపై అత్యాచారం.. కడుపు నొప్పి రావడంతో..