సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 22 రోజుల దసరా సెలవులు...

durgamma as annapurna
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులను ఏకంగా 22 రోజుల పాటు ఇచ్చింది. దుర్గా పూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10వ తేదీ నుంచి సెలవులు ప్రకటించింది. పాఠశాలలతో పాటు కార్యాలయలాకు కూడా ఈ సెలవులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ సెలవు రోజుల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగవని పేర్కొంది. అంతేకాకుండా, దుర్గాపూజ జరిగే నెలలో 22వ రోజులు సెలవులు తీసుకునే వెసులుబాటును కల్పించింది. 
 
మరోవైపు, ఈ హాలిడేస్‌లో ఒడిషా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఏకంగా 34 రోజుల సెలవులు మంజూరు చేసింది. ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో 33 రోజులు, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 32 రోజులు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో 28 రోజులు సెలవు ఇచ్చాయి.
 
అయితే, బెంగాల్ రాష్ట్రంలో ఈ 28 రోజుల పబ్లిక్ హాలిడేస్‌తో పాటు దసరా, దుర్గాపజూ సందర్భంగా ఇస్తున్న సెలవులు కూడా అదనం. ఇకపోతే, దేశంలో అతి తక్కువ సెలవులు ఇస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఆ తర్వాత బిహార్ రాష్ట్రాలు ఉన్నాయి.