గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 ఆగస్టు 2022 (10:30 IST)

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. విదేశాల్లో సోనియా ఫ్యామిలీ..

sonia gandhi
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాయక మండలి అని కాంగ్రెస్ వర్కింట్ కమిటి సమావేశం ఆదివారం జరుగనుంది. ఇందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీలు వర్చువల్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. సోనియాతో పాటు రాహుల్, ప్రియాంకలు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వైద్య పరీక్షల కోసం సోనియా వెళ్లగా ఆమెకు తోడుగా రాహుల్, ప్రియాంకలు వెళ్లారు. దీంతో వారు ఈ వర్కింగ్ కమిటీ సమావేశానికి వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఇందులో భవిష్యత్‌లో జరుగనున్న ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. 
 
మరోవైపు, గత కొన్ని రోజులుగా ఆ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా పార్టీలో నమ్మకబంటుగా ఉంటూ వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అనేక సంచలనం ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో మిగిలిన  నేతలు సోనియా, రాహుల్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించే అవకాశం వుంది. మరోవైపు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ జోడో యాత్రను నిర్వహించనుంది. ఇందుకోసం రాష్ట్రాల వారీగా సమన్వయకర్తలను నియమించనుంది. వీరిలో ఏపీకి ఎస్వీ రమణ, తెంలగాణకు డాలీశర్మలు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు.