1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (17:21 IST)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సోనియా గాంధీ భేటీ

sonia - murmu
భారత కొత్త రాష్ట్రపతిగా ఎంపికైన ద్రౌపది ముర్ముతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగింది. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన సోనియా గాంధీ కొత్త రాష్ట్రపతి ముర్ముతో  భేటీ అయ్యారు. వీటి భేటీ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. రాష్ట్రపతితో సోనియా గాంధీ సమావేశమయ్యారని వెల్లడించింది. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో అట్టుడుకిపోతోంది. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. అలాగే, జమ్మూకాశ్మీర్ ప్రచార కమిటీ పదవికి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతితో సోనియా గాంధీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.