శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా గాంధీ

sonia gandhi
నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన నిధుల మళ్లింపు వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోమారు మంగళవారం ఎన్‍‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఈ నెల 21వ తేదీన ఆమె వద్ద ఈడీ అధికారులు మూడు గంటల పాటు విచారించారు. రెండో దఫా విచారణలో భాగంగా, మంగళవారం ఆమె మరోమారు విచారించనున్నారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా, 26వ తేదీన మరోమారు విచారణకు రావాలంటూ సోనియాకు ఈడీ సమన్లు జారీ చేశారు. దీంతో ఆమె మంగళవారం ఈడీ కార్యాలయానికి రానున్నారు. ఇదిలావుంటే, సోనియా విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం కీలక భేటీ నిర్వహించింది. 
 
సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల శాఖలు, విభాగాల ఇన్‌ఛార్జులు, ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటీకి పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే హాజరై, అహింసా మార్గంలో బీజేపీ సర్కారుకు నిరసన తెలుపాలని సూచించారు.