మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (16:21 IST)

ప్రారంభమైన ఒప్పో రెనో 8 ఫైవ్‌జీ ఫోన్ విక్రయాలు

oppo reno8
భారతీయ స్మార్ట్ ఫోన్ మొబైల్ మార్కెట్‌లోకి సోమవారం నుంచి ఒప్పో రెనో 8 ఫైవ్ జీ ఫోన్లు అమ్మకానికి అందుబాటులోకి తెచ్చారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే రెనో 8 ప్రో 5జీ విక్రయాలు అందుబాటులోకి రాగా, తాజాగా రెనో 8 ఫైవ్ జీ మోడల్ తొలి ఓపెన్స సేల్‌ను సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభించనున్నారు. 
 
తొలి సేల్ సందర్భంగా రూ.3 వేల డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే, కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపైనే ఈ ఆఫర్ లభిస్తుంది. 90హెచ్‌జడ్ రిఫ్రెష్ ఉన్న అమోల్డ్ డిస్‌ప్లే , మీడియాటెక్ డైమన్సిటీ ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. 
 
అలాగే, 80 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 766 ప్రధాన కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఒప్పో రెనో 8 సేల్ వివరాలు, ఆఫర్లు, స్పెసిఫికేషన్లను ఓ సారిపరిశీలిస్తే, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోను ధర రూ.29,999గా ఖరారు చేశారు. ఇది ఒకే వేరియంట్‌గా లభించనుంది.