బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జులై 2022 (16:14 IST)

లులూ షాపింగ్ మాల్‌లో 50 శాతం ఆఫర్.. వరదలా తరలివచ్చారు

lulu mall
కొచ్చిన్‌లోని లులూ షాపింగ్ మాల్‌లో 50 శాతం ఆఫర్ ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న అనేక మంది కొనుగోలుదారులు వదలా తరలివచ్చారు. కొచ్చిన్‌లో ఉన్న లులూ ఔట్ లెట్ వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్‌లో తాజాగా భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. అందుకే జనం ఇలా వరదలా తరలివచ్చారని వారు తెలిపారు.
 
జూలై 6వ తేదీ అర్థరాత్రి 7వ తేదీన ఉదయం దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. సామాజిక మాధ్యమాల్లోకి చేరిన ఈ వీడియోలు అక్కడి పరిస్థితిని కళ్ళకు కడుతున్నాయి. మాల్స్ బయట, లోపల, ఎలివేటర్ ఎక్కడ చూసినా జనం వేలం వెర్రిని తలపించారు. 
 
ఈ షాపింగ్‌లోని అన్ని వస్తువులపై 50 శాతం ఆఫర్ ప్రకటించడంతో ఒక్కసారిగా కొనుగోలుదారులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకోవడం అద్భుతమంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. భారతీయ ప్రజల్లో అనేక మంది రాయితీలతో వస్తువులను కొనుగోలు చేసేందుకు అమితాసక్తిని చూపుతున్న విషయం తెల్సిందే.