సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (20:50 IST)

కేరళలో మరో అంటువ్యాధి.. ఆంథ్రాక్స్‌తో అడవి పందులు మృతి

కేరళలో మరో అంటువ్యాధి కలకలం రేపుతోంది. కేరళలోని అత్తిరప్పిళ్లి అటవీ ప్రాంతంలో ఇటీవల వరుసగా అడవి పందులు చనిపోతున్నట్టు అధికారులు గుర్తించారు. 
 
దానికి కారణమేంటన్న అనుమానంతో శాంపిల్స్‌ను తీసి పరీక్షలకు పంపారు. అవన్నీ ఆంథ్రాక్స్ తో చనిపోయినట్టు నివేదికల్లో తేలింది. అయితే ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు.
 
ఆ వైరస్ ఇతర పశువులకు, వాటి నుంచి మనుషులకు విస్తరించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఆంథ్రాక్స్ కేసులు బయటపడిన ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పశువులకు "ఆంథ్రాక్స్" వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్ణయించారు. బాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే ఒక రకం బ్యాక్టీరియా సోకడం వల్ల ఆంథ్రాక్స్ వ్యాధి వస్తుంది.