గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (10:19 IST)

చేతిలో ఆయుధం లేదు.. కత్తితో దాడి.. హీరోలా అదరగొట్టాడు.. (వీడియో)

Kerala
Kerala
కేరళలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఒక రహదారిపై పోలీసు వాహనం ఒకవైపు ఆగుతుంది. ఇంతలో డోర్‌ ఓపెన్‌ చేసుకుని అధికారి దిగుతుంటాడు. అంతే ఇంతలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి పెద్ద కొడవలితో దాడి చేస్తాడు. 
 
దీంతో సదరు పోలీసు అధికారి ఆయుధం లేకపోయినా ఏ మాత్రం భయపడకుండా అతన్ని ఎదుర్కొంటాడు. అంతేకాదు అక్కడే ఉన్న కొంతమంది కూడా ఆ అధికారికి సాయం చేస్తారు.
 
చివరికి ఆ వ్యక్తిని కిందపడేసి అతని చేతిలోంచి ఆయుధాన్ని లాక్కుంటాడు. కొడవలితో దాడి చేసిన వ్యక్తి సుగతన్‌గా గుర్తించారు. ఈ వీడియోని పోలీస్ సర్వీస్ అధికారి స్వాతి లక్రా ట్విట్టర్‌లో 'అసలైన హీరో ఇలా ఉంటాడు' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్‌ చేశారు.