మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జూన్ 2022 (19:30 IST)

"విరాటపర్వం" సినిమాపై సుల్తాన్ బజార్ ఠాణాలో వీహెచ్‌పీ ఫిర్యాదు

Virataparvam
దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం "విరాటపర్వం". శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం యువతను పెడదారి పట్టించేలా ఉందని విశ్వహిందూ పరిషత్ నేతలు అంటున్నారు. దీంతో ఈ చిత్రం ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్‌పీ నేతలు హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. 
 
ఈ మేరకు వీహెచ్‌పీ నేత అజయ్ రాజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదాలను, నక్సలిజంలను ప్రేరేపించేలా ఈ చిత్రం ఉందని, ఇలాంటి సినిమాలకు అనుమతులు ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతను పెడదారి పట్టించేలా ఉందని ఆరోపించారు. అయితే, ఈ  ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది.