గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (20:39 IST)

సెక్రెట్‌గా వివాహం చేసుకున్న మ‌ధుశాలినీ

Madhushalini, Gokul Anand
Madhushalini, Gokul Anand
హీరోయిన్ల పెండ్లిళ్లు వ‌రుస‌గా జ‌రిగిపోతున్నాయి. ఇటీవ‌లే న‌య‌న‌తార ప్రేమించిన‌వాడినే వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె బాట‌లో మ‌ధుశాలినీ చేరింది. ఇటీవ‌లే `9 అవ‌ర్స్‌` అనే వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్‌కు వ‌చ్చిన‌ప్పుడు పెండ్లి గురించి దాట‌వేసింది. తాజాగా ఈనెల 16న హైద‌రాబాద్ ప‌రిమిత స‌భ్యుల‌తో వివాహం చేసుకుని ఫొటోను పోస్ట్ చేసింది. మధు షాలిని & గోకుల్ ♥️ లవ్ అంటూ కాప్ష‌న్ కూడా పెట్టింది. `మేము అందుకున్న ప్రేమకు ధన్యవాదాలు. మేము మా జీవితంలోని కొత్త అధ్యాయం కోసం మా హృదయాలలో ఆశ, కృతజ్ఞతతో ఎదురుచూస్తున్నాము అంటూ పోస్ట్‌లో పేర్కొంది.
 
త‌మిళంలో బిజీగా వుండ‌డంతో తెలుగులో గేప్ తీసుకున్న‌ట్లు చెప్పింది. గోకుల్ ఆనంద్ కోలీవుడ్‌లో హీరోగా చేయ‌డంతోపాలు ప‌లు వెబ్ సిరీస్ చేశాడు. వీరిద్ద‌రు పంచాక్ష‌రం అనే సినిమాలో న‌టించారు. అప్ప‌టినుంచి వీరి ప్రేమ చిగురించి ఇప్ప‌టికి పెండ్లిదాకా వ‌చ్చింది. ఆమె పెట్టిన పోస్ట్‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.  మ‌ధుశాలినీ త్వ‌ర‌లో నిర్మాత‌గా కూడా మార‌బోతోంది.