మహేష్‌బాబు సినిమాలో నటించడంలేదు - తారకరత్న
ఇటీవల సోషల్‌మీడియాలో తాను మహేష్‌బాబు సినిమాలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను తారకరత్న ఖండించారు. తాజాగా ఆయన 9అవర్స్ అనే వెబ్ సిరీస్ చేశాడు. నందమూరి తారకరత్న ఈ విషయమై మాట్లాడుతూ, సోషల్‌మీడియాలో అస్సలు నేను లేను. నా గురించి ఎందుకు అలా రాస్తున్నారో అర్థంకాదు. ఒకవేళ రాసినవారే నిర్మాతగా సినిమా తీస్తారేమో. నా డేట్స్ కూడా వారే చూస్తున్నారామో అంటూ చురకలేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఏవోవే రాసేస్తున్నారు. అస్సలు నేను వాటిని పట్టించుకోను. ఒకవేళ అవకాశం వస్తే ఎవరు కాదంటారు చెప్పండి.. అంటూ ఎదురు ప్రశ్నించారు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడం అదృష్టమే కదా అన్నారు. ఏదిఏమైనా ఆ సినిమా గురించి నిర్మాత మైత్రీ మూవీస్ ప్రకటించాలి. అప్పటివరకు వరకు ఏవిపడితే అవిరాయకండి అంటూ హితవు పలికారు.