ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 మే 2022 (11:29 IST)

అనాధ బాల‌బాలిక‌ల‌కు న‌మ్ర‌తా శిరోద్క‌ర్ సాయం

namratha with Orphans
namratha with Orphans
మ‌హేష్‌బాబు ఫౌండేష‌న్ ద్వారా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌కు న‌మ్ర‌తా శిరోద్క‌ర్ శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. త‌మ కొడుకు గౌత‌మ్ శ్వాస‌సంబంధ వ్యాధితో పుట్టిన‌ప్పుడే క‌ల‌త చెందిన మ‌హేస్‌బాబు ఆ రోజు నుంచి ఇలాంటి ఎంతో మంది త‌ల్లిదండ్రులు బాధ‌ను ఒక్క‌సారి గుర్తుచేసుకుంటూ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతోమందికి స‌రుకులు, ఆక్సిజ‌న్, గుండె శస్త్రచికిత్స‌లు నిర్వ‌హించారు.   
 
namratha with Orphans
namratha with Orphans
న‌మ్ర‌త శిరోద్క‌ర్ మ‌హిళ‌కు సంబంధించిన ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. తాజాగా అవగాహన ప్రచారంలో భాగంగా నంద్యాలలో BIRDS NGO నుండి స్వతంత్ర ఒంటరి తల్లులు చేతితో తయారు చేసిన శానిటరీ న్యాప్‌కిన్‌లను అనాథాశ్రమంలో ఉన్న బాలికలందరికీ పంపిణీ చేసింది.  రుతుక్రమలో మ‌హిళ‌లు ప‌డుతున్న బాధ‌లు చెప్ప‌న‌ల‌వికావు. అందులో అనాథ బాల‌బాలిక‌ల‌ను అండ‌గా వుండేందుకు ఇటువంటి కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాన‌ని ఈ సంద‌ర్భంగా న‌మ‌త్ర పేర్కొన్నారు.