బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 మే 2022 (20:39 IST)

బాలీవుడ్ గురించి రాజ‌మౌళి గురించి మ‌హేష్‌బాబు ఏంచెప్పాడో తెలుసా! (video)

Maheshbabu
Maheshbabu
మ‌హేష్‌బాబు తాజా సినిమా `స‌ర్కారువారిపాట‌` ఈనెల 12న విడుద‌లవుతుంది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప‌లుచోట్ల ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఈరోజు ప్ర‌త్యేకంగా ఇచ్చిన ఇంట‌ర్యూలో ప‌లు విష‌యాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. వాట‌న్నింటికీ చాలా ఓపిగ్గా సావ‌ధానంగా సింపుల్‌గా మ‌హేష్‌బాబు స‌మాధాన‌మిచ్చారు. 
 
బాలీవుడ్ సినిమాలు చేయ‌ను అని ఇంత‌కుముందు అన్నారు. ఇప్పుడు పాన్ ఇండియాగా సినిమాలు మారాయి? మ‌రి ఇప్పుడు మీరేమంటారు?
నేను అప్పుడ‌యినా ఇప్పుడ‌యినా తెలుగు సినిమానే చేస్తాను. తెలుగు సినిమా ఎక్క‌డికో వెళ్ళిపోయింది. మ‌న సినిమా చేస్తే ఆటోమెటిక్‌గా అన్ని భాష‌ల్లోకి వెళ్ళిపోతుంది.
రాజ‌మౌళి సినిమా చేస్తున్నారుగా? మ‌రి అది ఏ సినిమా అంటారు?

 


ఆల్‌రెడీ ఆయ‌న స్థాయి ప్ర‌పంచానికి తెలుసు. ఆయ‌న సినిమా చేస్తే చాలు అంద‌రికీ రీచ్ అయిపోతాం. 
రాజ‌మౌళితో సినిమా చేయ‌డం ఎలా అనిపిస్తుంది?
రాజ‌మౌళిగారితో సినిమా చేయ‌డం అంటే 25 సినిమాలు చేసిన అనుభ‌వం వ‌స్తుంది.
స‌ర్కారువారిపాట‌లో మీరేం నేర్చుకున్నారు?
మామూలుగా సినిమా అంటేనే 6,8 నెల‌లు అనుకుంటాం. కానీ క‌రోనా వ‌ల్ల రెండేళ్ళు ప‌ట్టింది. ఈ రెండేళ్ళ‌లో చాలా మార్పులు సంభ‌వించాయి. షూటింగ్‌లోనూ చాలా విస‌యాలు తెలుసుకున్నాను.
ప్రీరిలీజ్ వేడుక‌లో మీరు భావోద్వేగానికి గుర‌య్యారు?
అవును. రెండేళ్ళ‌లో నా అనుకున్న‌వారు దూర‌మ‌య్యారు. అది చాలా భ‌రించ‌లేనిది. అది అనుభ‌వంలోకి వ‌చ్చిన‌వారికే తెలుస్తుంది. అందుకే ఆరోజు ఒక‌సారి గుర్తు చేసుకున్నాను.
క‌ళావ‌తి సాంగ్ మీరు వ‌ద్ద‌న్నార‌ట‌?
క‌ళావ‌తి పాట చాలా నిదానంగా సాగుతూ, అమ్మాయి వెంటప‌డే సాంగ్‌. ఇది నా స్థాయికి క‌రెక్టేనా అనే అనుమానం క‌లిగింది. ఆ విష‌యం థ‌మ‌న్‌కు చెప్పాను. ద‌ర్శ‌కుడు కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అయితే థ‌మ‌న్ స‌సేమిరా అంటూ.. నా మాట వినండి.. ఈ పాట ప్ర‌తి ఊరిలో పెండ్లిల్ల‌లో వినేపాట అవుతుంద‌న్నాడు. ఆ సాంగ్ ఆయ‌న చెప్పిన‌ట్లు ఎంతో పాపుల‌ర్ అయింది. థ‌మ‌న్ ప్రేక్ష‌కుల నాడి బాగా ప‌సిగ‌ట్టాడు.