ఓటీటీకి సర్కారువారి పాట - పోకిరితో పోలికే లేదు
Maheshbabu
కానీ సినిమా విడుదలకుముందు పోకిరీ సినిమాతోనే చిత్ర యూనిట్ పోల్చింది. అసలు పోకిరి సినిమాకూ దీనికి ఏమాత్రం సంబంధంలేదు. పోకిరిలో మహేస్‌బాబు సరదాగా హీరోయిన్‌ను ఆటపట్టిస్తుంటాడు. కానీ ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ ఛీటింగ్ పేరుతో ఆటపట్టిస్తుంది. అందులోని పాయింట్ దర్శకుడు పూరీ టేకింగ్ కథలో మలుపులు సరికొత్తగా అనిపిస్తాయి. సర్కారువారిపాటలో అలాంటి మలుపులు ఏమీ లేవు. కేవలం పబ్లిసిటీ కోసం ఇలా చేశారని తెలుస్తోంది.
ఇక మహేష్‌బాబు బాలీవుడ్‌పై మాట్లాడిన మాటలు చాలామంది రకరకాలుగా విశ్లేషించారు. వర్మ అయితే అసలు మహేష్‌బాబు మాటలు నాకేం అర్తంకాలేదు అన్నాడు. ఇప్పుడు పోకిరి సినిమాతో పోల్చడం కూడా అటువంటిదే అని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాను నాలుగు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ ఆఫర్‌తో ఈ సినిమాను వారు కొనుగోలుచేశారు.
