సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు
parasuram, Ravishankar,naveen
ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. మొదటి ఆట నుండే సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ , క్లాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు సర్కారు వారి పాట నచ్చింది. మహేష్ బాబు గారితో సర్కారు వారి పాట లాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా అయితే బావుంటుదని బలంగా నమ్మి సెట్స్ కి వెళ్ళడం జరిగిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. మార్నింగ్ షో నుండి కొనసాగుతున్న ప్రభంజనం అన్ని వర్గాల ప్రేక్షకులకి ఇంకా బలంగా తాకుతుందని నమ్ముతున్నాను. సర్కారు వారి పాట దేశం ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కథ. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐ తో ఇబ్బంది పడని మిడిల్ క్లాస్ మనిషి వుండరు. అలాంటి పాయింట్ ని మహేష్ బాబు గారి లాంటి సూపర్ స్టార్ తో చెప్పించడం సినిమాకి ప్లస్ అయ్యింది. ఇలాంటి కథ రాయడం రచయిత, దర్శకుడిగా నాకూ ఒక తృప్తిని ఇచ్చింది. సర్కారు వారి పాటని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు '' అన్నారు పరశురామ్
Producers calebrations
నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ... సర్కారు వారి పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందగా వుంది. ట్రైలర్ చూసి ప్రేక్షకులు ఎంత ఎక్సయిటింగా ఫీలయ్యారో .. సినిమా చూసి అంతకంటే ఎక్కువ ఎక్సయిట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఇంత పండగలాంటి సినిమా సర్కారు వారి పాటే.
ఇప్పుడడంతా పాన్ ఇండియా సినిమాలైపోయాయి. పూర్తిగా తెలుగులో సర్కారు వారి పాట లాంటి పెద్ద సినిమా మళ్ళీ చూడగలమా అంటే సందేహమే. మహేష్ బాబు గారు సర్కారు వారి పాటలో నటన పరంగా విజ్రుభించారు. అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి. సర్కారు వారి పాట మేము వూహించినదాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది' అన్నారు.

