బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 మే 2022 (19:33 IST)

మ‌హేష్ నాతో నేను ఏమైనా తప్పు చేశానా అన్నారు - కీర్తి సురేష్

Kirti Suresh
Kirti Suresh
మహేష్ బాబు చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా కోసం కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మే 12న (గురువారం ) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపధ్యంలో  హీరోయిన్ కీర్తి సురేష్ మీడియాతో ముచ్చటించారు. కీర్తి పంచుకున్న సర్కారు వారి పాట విశేషాలు...
 
మహానటి తర్వాత సర్కారు వారి పాట లాంటి ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌లో చేస్తున్నారు. దర్శకుడు పరశురాం ఈ కథ చెప్పినపుడు మీ మొదటి రియాక్షన్ ఏంటి ?
చాలా హ్యాపీ అండ్ ఎక్సయిటింగ్ గా అనిపించింది. ఇలాంటి పాత్ర ఇంతకుముందు చేయలేదు. దర్శకుడు పరశురాం సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుంది. సర్కారు వారి పాటలో కూడా కళావతి పాత్ర చాలా కీలకం. ఇంతపెద్ద కమర్షియల్ సినిమాలో అంతే ప్రాధాన్యత వున్న పాత్ర దక్కడం అదృష్టం. పరశురాం కథ విన్న వెంటనే ఓకే చెప్పా. సర్కారు వారి పాట ఖచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.  
 
సావిత్రి గారి బయోపిక్ లో దాదాపు అన్నీ ఎమోషన్స్ లో వచ్చేశాయి కదా?
లేదు. కళావతి పాత్ర చాలా కొత్త కోణంలో వుంటుంది. సావిత్రి గారి బయోపిక్ లో అన్నీ కోణాలు వున్నా.. సర్కారు వారి పాటలో  'కళావతి' మాత్రం చాలా కొత్తగా వుంటుంది. తెరపై మీరే చూస్తారు. 
 
మహేష్ బాబులో చాలా సెన్స్ అఫ్ హ్యుమర్ వుంటుంది కదా, సెట్స్ లో ఆయన ఎలా వుండేవారు? 
మహేష్ బాబు టైమింగ్ మామూలుగా వుండదు. సెట్‌లో చాలా సైలంట్ గా పంచులు పేలిపోతుంటాయి. మొదట సిరియస్  అనుకుంటాం.,. కానీ తర్వాత తెలుస్తుంది... ఆయన సరదా ఆటపట్టిస్తున్నారని. సర్కారు పాట షూటింగ్ చాలా సరదా జరిగింది. చివరి లో షూట్ చేసిన పాట కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఆ పాటలో మొదట రెండు సార్లు మహేష్ టైమింగ్‌ని పట్టుకోలేకపోయాను. సారీ చెప్పాను. మూడోసారి మెల్లగా నా దగ్గరికి వచ్చి..''నేను ఏమైనా తప్పు చేశానా ?'' అన్నారు. నేను మళ్ళీ సారీ చెప్పాను (నవ్వుతూ). మహేష్ బాబుగారి తో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ . 
 
కళావతి పాట విజయం ఎలా అనిపించింది? 
నా కెరీర్ లో ఒక సాంగ్ ఇంత పెద్ద హిట్ కావడం సర్కారు వారి పాట కళావతితోనే జరిగింది.  150మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం అంటే మాటలు కాదు. నా పాత్ర పేరుతో ఇంత పాపులర్ రావడం చాలా ఆనందంగా వుంది. తమన్ గారు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది.  అలాగే సర్కారు వారి పాటలో లాస్ట్ సాంగ్ వండర్ ఫుల్ గా వుంటుంది. నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే జ్ఞాపకంగా వుంటుంది. 

బార్సిలోనా మా బేగ్‌లు కొట్టేశారు
 
మహేష్ బాబు గారి గ్లామర్ సీక్రెట్ మీకేమైనా చెప్పారా ? 
సీక్రెట్ ఏమీ లేదు. ఆయన ఎప్పుడూ ఆనందంగా వుంటారు. చాలా పాజిటివ్‌గా వుంటారు. అదే ఆయన గ్లామర్ సీక్రెట్. 
 
మూడు పెద్ద బేన‌ర్లు క‌లిసి చేస్తున్న సినిమా చేయడం ఎలా అనిపించింది ? 
మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్.. వండర్ ఫుల్ ప్రోడ్యూసర్స్. సినిమా పట్ల ప్యాషన్, అంకితభావం వున్న నిర్మాతలు. కరోనా, లాక్ డౌన్ లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని కూడా ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకులకు అద్భుతమైన వినోదం పంచాలనే లక్ష్యంతో 'సర్కారు వారి పాట'ని ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.
 
సర్కారు వారి పాట షూటింగ్ లో మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా ? 
ఒక షాకింగ్ ఇన్సిడెంట్ వుంది. బార్సిలోనా లో కళావతి పాట షూట్ చేస్తున్నాం. వ్యాన్ లో నాలుగు బాక్సుల కాస్ట్యూమ్స్ పెట్టాం. షాట్ గ్యాప్‌లో మూడు బాక్సులు ఎవరో కొట్టేశారు. మిగిలిన ఒక్క బ్యాగ్ లో లక్కీగా కంటిన్యూటీ కాస్ట్యూమ్ వుంది. చాలా టెన్షన్ పడ్డాం. అయితే టీమ్ అప్పటికప్పుడు మళ్ళీ కాస్ట్యూమ్స్ ఏర్పాటు చేశారు.
 
ఖాళీ సమయంలో మీ సినిమాలు చూస్తుంటారా ? 
లేదు. అలా చూసినప్పుడు బోలెడు తప్పులు కనిపిస్తాయి. ఇది ఇంకా బాగా చేయాల్సింది కదా అనిపిస్తుంది. అందుకే ఖాళీ సమయాల్లో నా సినిమాల జోలికి వెళ్లాను. ఇంట్లో మా కుక్క పిల్ల నైకీ వుంది. గ్రాండ్ మదర్ తో కబుర్లు చెప్పుకుంటాను. ఫ్యామిలీతో కలసి కేరళ వెళ్తుంటాం.