మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (10:34 IST)

యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి

karate kalyani
యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డిపై ప్రముఖ సినీనటి కరాటే కల్యాణి దాడి చేసింది. నడిరోడ్డుపై అతనిని చితకబాదింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె అతడిపై దాడి చేసింది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలోని మధురానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రాంక్ వీడియోలు చేయడంలో శ్రీకాంత్ రెడ్డి దిట్ట. ఇతడి ఇంటికి వెళ్లిన కరాటే కళ్యాణి  ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ఫైర్ అయ్యింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అది ఘర్షణకు దారితీసింది.
 
ఈ క్రమంలో మధురానగర్ రోడ్డులో శ్రీకాంత్ రెడ్డి చెంప చెళ్లుమనిపించింది. ఆ సమయంలో అక్కడున్న వారు కూడా శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. అనంతరం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసింది. ప్రతిగా శ్రీకాంత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.