మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 14 మే 2022 (18:26 IST)

మ‌హేష్‌బాబు అభిమానుల‌కు విషెస్ చెప్పిన నమ్రతా శిరోద్కర్

Namrata Shirodkar,at sudarshan theater
Namrata Shirodkar,at sudarshan theater
సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన సర్కారు వారి పాట చిత్రం గురువార‌మే విడుద‌లైంది. ఈ సినిమాను మూడు ప్ర‌ముఖ బేన‌ర్లు నిర్మించాయి. మొద‌టిరోజే మంచి టాక్ తెచ్చుకోవ‌డంతో నిర్మాత‌లు మైత్రీమూవీ మేకర్స్ ట‌పాసుల‌తో ఆనందం వ్య‌క్తం చేసుకున్నారు. మ‌రో నిర్మాత ఎస్‌.వి.క్రియేష‌న్స్ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం రాత్రి దిల్‌రాజు ఆధ్వ‌ర్యంలో పార్టీ సంద‌డి చేసుకున్నారు.
 
Parasuram, namrata
Parasuram, namrata
ఇక మూడో నిర్మాణ సంస్థ మ‌హేష్‌బాబు నిర్మాణ సంస్థ ఎ.ఎం.బి. సంస్థ‌. ఈ సంస్థ త‌ర‌ఫున మ‌హేష్ స‌తీమ‌ణి  నమ్రతా శిరోద్కర్ మరియు సర్కారు వారి పాట బృందం హైదరాబాద్‌లోని సుదర్శన్ 35mm వద్ద శ‌నివారంనాడు మ్యాట్నీని వీక్షించారు. ఆమె రాక సంద‌ర్భంగా కృష్ణ‌, మ‌హేస్‌బాబు ఆల్ ఇండియా ఫ్యాన్స్ అధ్య‌క్షుడు, అభిమానులు నినాదాలు చేశారు.
 
న‌మ్ర‌త త‌న కుటుంస‌భ్యుల‌తో సినిమాను వీక్షించారు. అభిమానులు, ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో ఆమె తిల‌కించి పుల‌కించిపోయారు. సినిమా ఆరంభానికి ముందు జ‌న‌గ‌న మ‌ణ‌.. జాతీయ గీతం వేయ‌గానే అంద‌రూ గౌర‌వంగా నిల‌బ‌డి సెల్యూట్ చేశారు. అనంత‌రం సినిమా ముగిశాక అభిమానుల స‌మ‌క్షంలో కేక్‌ను క‌ట్‌చేశారు. ఈ సినిమాను ఇంత‌గా ఆద‌రిస్తున్న మ‌హేష్‌బాబు అభిమానుల‌కు నమ్రతా శిరోద్కర్ న‌మ‌స్కారం పెడుతూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.