1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (20:18 IST)

ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి మజ్జా మజ్జా సాంగ్ విడుదల

Srikanth Reddy, Sanchita Bashu
Srikanth Reddy, Sanchita Bashu
వెటరన్ నిర్మాత  ఏడిద నాగేశ్వరరావు స్థాపించిన పూర్ణోదయ, ఇప్పుడు శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో తిరిగి నిర్మాణంలోకి వచ్చింది. మిత్రవింద మూవీస్‌ తో కలిసి ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ “ఫస్ట్ డే ఫస్ట్ షో” చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆయన కుమారుడు ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
“ఫస్ట్ డే ఫస్ట్ షో” సరికొత్త కామెడీ ఎంటర్‌ టైనర్. రాధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో “మజ్జా మజ్జా”  సాంగ్ ని విడుదల చేసి ఆడియో ప్రమోషన్‌లను ప్రారంభించింది చిత్ర యూనిట్.
హీరో తన ప్రేయసి ఉద్దేశించి పాడుకున్న ఈ పాట కాలేజీ నేపధ్యంలో క్లాస్ గా మొదలై పెప్పీ డ్యాన్స్  నెంబర్ గా టర్న్ తీసుకోవడం ఆసక్తికరంగా వుంది. వంశీధర్ గౌడ్ , వాసు వలబోజుల తెలంగాణ యాసలో పాటకు రాసిన సాహిత్యం క్యాచిగా వుంది.
 
 నా గుండె గిలాగిలా కొట్టుకుంటాందే, నా పాణం విలావిలా మొత్తుకుంటునాదే, నీవు చూడకు జర నవ్వుకు నన్ను ఆగం చెయ్యకే  ♫
పాటలో వినిపించిన లిరిక్స్ సరదాగా అలరిస్తున్నాయి. ఆంథోని దాసన్ ఫుల్ ఎనర్జిటిక్ గా పాడిన ఈ పాటకు విశ్వ రఘు మాస్టర్ డిఫరెంట్ కొరియోగ్రఫీ అందించారు.
శ్రీకాంత్ రెడ్డి తన డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నాడు. సంచితా బషు అందంగా కనిపించింది. 
 
జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రం రైటింగ్ విభాగంలో వున్నారు.  ఈ చిత్రానికి కథ అందించిన అనుదీప్, వంశీధర్ గౌడ్, కళ్యాణ్ లతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రానికి డైలాగ్స్‌ను అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్ రాశారు.
 
వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మాధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్,  సాయి చరణ్ బొజ్జా
సాంకేతిక విభాగం-  సమర్పణ: ఏడిద శ్రీరామ్,  కథ: అనుదీప్ కెవి,  నిర్మాత: శ్రీజ ఏడిద,  దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి,  స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్,  డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్,  సంగీతం: రాధన్,  డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి,  ఎడిటర్: మాధవ్