శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (14:02 IST)

సెంట్రల్ మినిస్టర్‌గా వెన్నెల కిషోర్

Vennela Kishore
Vennela Kishore
ఇటీవల వినూత్నమైన పోస్టర్స్‌తో వైవిధ్యమైన టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం హ్యాప్తీ బర్త్‌డే. మత్తువదలరా చిత్రంతో అందరి దర్శకుల్లో నేను డిఫరెంట్ అని తన ప్రతిభను నిరూపించుకున్న రితేష్‌రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం హ్యాప్తీ బర్త్‌డే. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెరీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా జూలై 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రబృందం తాజాగా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌ను పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రంలో వెన్నెల కిషోర్ పాత్రను వుద్దేశించి పేరు రితిక్‌సోది. ఓవర్గానికి విరోధి అంటూ వాయిస్‌ఓవర్‌లో వచ్చే సంభాషణలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. రెండు చేతుల్లో రెండు గన్స్‌తో వెన్నెలకిషోర్ ఈ ప్రచార చిత్రంలో కనిపిస్తున్నాడు. నైటీ వేసిన నాటి ఫెలో అంటూ ఆ పాత్రను వుద్దేశించి ఉపయోగించిన డైలాగ్స్ ఇలా.. అన్ని చూస్తుంటే రితిక్‌సోది పాత్రలో వెన్నెల కిషోర్ పాత్ర నవ్వులు పూయించడం ఖాయంలా కనిపిస్తుంది. 
 
ఈ చిత్రంలో వెన్నెలకిషోర్ సెంట్రల్ మినిస్టర్‌గా గన్‌బిల్లును ఆమోదించడం.. గన్‌పాలసీని ప్రతిపాదించడం, ఇవన్నీ పూర్తి కామెడీ ప్రధానంగా వుండబోతున్నాయి. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై అందరిలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. కాలభైరవ  సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ సారంగం సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని సర్‌ఫ్రైజ్‌లు వుండబోతున్నాయని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం : కాలభైరవ, ప్రొడక్షన్ డిజైనర్: నార్నీ శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాలా, లైన్‌ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయికుమార్,  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవీవీ, పీఆర్‌ఓ: వంశీ శేఖర్, మడూరి మధు