1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Hero Kiran Abbavaram Rules Ranjan Launch

హీరో కిరణ్ ఆబ్బవరం రూల్స్ రంజన్ ప్రారంభం

Kiran Abbavaram,   AM Ratnam, Krish and others
Kiran Abbavaram, AM Ratnam, Krish and others
ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై అబ్బవరం, వెన్నెల కిషోర్,హిమాని, వైశాలి,జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్),అతుల్ పర్చురే (బాలీవుడ్) ,ఆశిష్ విద్యార్థి, అజయ్ నటీనటులు గా రత్నం కృష్ణ దర్శకత్వంలో వస్తున్న నూతన చిత్రం "రూల్స్ రంజన్".
 
ఈ చిత్రం ప్రారంభోత్సవ  పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు క్రిష్  హీరో కిరణ్ అబ్బవరం పై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా ,దర్శక, నిర్మాత ఏ.ఎం రత్నం స్క్రిప్ట్ అందించి  కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.
 
నటీనటులు- కిరణ్ అబ్బవరం ,వెన్నెల కిషోర్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్),అతుల్ పర్చురే (బాలీవుడ్) ,ఆశిష్ విద్యార్థి,  అజయ్ ,
గోపరాజు రమణ, జెమినీ సురేష్, తులసి, అభిమన్యుసింగ్, హిమాని, వైశాలి,జయవాణి, ముంతాజ్, మనోహర్ సింగ్
 
సాంకేతిక నిపుణులు-  ప్రజెంట్స్ :  ఏఎం రత్నం
రైటర్ డైరెక్టర్ : రత్నం కృష్ణ
కో డైరెక్టర్ : శ్రీకాంత్
కో ప్రొడ్యూసర్ :రింకు కుక్రెజ
లైన్ ప్రొడ్యూసర్ అండ్ కో డైరెక్టర్ : కే రంగనాథ్
డిఓపి : దులీప్ కుమార్
మ్యూజిక్ డైరెక్ట్ : అమ్రేష్ గణేష్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
లిరిసిస్ట్ : కాసర్ల శ్యామ్
ఎడిటర్ : వరప్రసాద్
పబ్లిసిటీ డిజైనర్ : ఆనంత్
About Writer
డీవీ
తర్వాతి కథనం
బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ : ఎఫ్3 టీం