మంగళవారం, 12 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మే 2022 (13:10 IST)

Happy Birthday Krishna: మహేశ్ బాబు భావోద్వేగం, మంజుల స్పెషల్ ఇంటర్వ్యూ (video)

Pulagam Chinnarayana, Superstar Krishna, Sheikh Jilan Basha
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కృష్ణకు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేగాకుండా మహేశ్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా తన తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే నాన్న. మీలాంటి ఉన్నతమైన వ్యక్తి మరొకరు ఉండరు. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి. లవ్ యూ' అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. 
 
అలాగే కృష్ణ 79వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేని ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఈ వయసులో కూడా స్లిమ్ గా కనిపించడం భగవంతుడు ఇచ్చిన వరం అని ఒక ప్రశ్నకు సమాధానంగా కృష్ణ చెప్పారు. 
 
"నా బరువు 76 నుండి 78 కిలోల మధ్య ఉంటుందని కృష్ణ చెప్పారు. స్వీట్లు తినడం తనకు ఇష్టం వుండదని, అలాగే కృష్ణ సినిమాల్లో మొదటి అవకాశం పొందిన తన అనుభవాన్ని, లెజెండరీ నటుడు ఎస్.వి.రంగారావుతో తన సంభాషణను పంచుకున్నారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయవచ్చు.