స్కూలు వ్యానును ఢీకొన్న కాలేజీ బస్సు.. వేర్వేరు ప్రాంతాల్లో..?
ఏపీలోని నంద్యాల జిల్లాలోని తమ రాజు పల్లె సమీపంలో మూలమెట్ట పెద్దమ్మ తల్లి యూటర్న్ వద్ద విజయానికేతన్ స్కూల్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
సంఘటన అనంతరం చిన్నారులను ఇళ్ళకు తిరిగి పంపించేశారు. బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవగా.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరోవైపు తమిళనాడులోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. తిరుచ్చి-తిరువానైక్కావల్‌లో స్కూలు వ్యానును కాలేజీ బస్సు ఢీకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులతో పాటు 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ శ్రీరంగం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో తిరువానైకావల్ శ్రీరంగం ప్రధాన రహదారిపై అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.