సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (13:09 IST)

ఎక్కడైనా బతుకు, పెరిగి పెద్దయ్యాక రా... అమ్మ అంత పనిచేసిందా?

ఓ తల్లి పేగు బంధాన్ని తెంపుకుంది. కుమారుడిని రైలు ఎక్కించి పంపిన తల్లిదండ్రులకు బుధవారం పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే, నగరంలోని రామంతాపూర్ కు చెందిన అంబికకు కుమారుడు మణికంఠ వున్నారు. భర్త చనిపోవడంతో శ్రీను అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరిక పాప జన్మించింది.  
 
ఎనిమిదేళ్ల మణికంఠ చెప్పిన మాట వినడం లేదని, ఎదురుతిరుగుతున్నాడని మంగళవారం సాయంత్రం వారు సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే కాకతీయ ఫ్యాసింజర్ ఎక్కించారు. 
 
ఎక్కడైనా బతుకు, పెరిగి పెద్దయ్యాక తమ వద్దకు రమ్మని చెప్పింది. ఆపై రైలులో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గమనించిన కొందరు.. స్టేషన్ ఘన్ పూర్ ఠాణా అప్పగించారు. బుధవారం తల్లిదండ్రులను రప్పించి కౌన్సిలింగ్ చేశారు.