1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (10:46 IST)

ప్ర‌భాస్‌ను అమిత్‌షా క‌ల‌వ‌బోతున్నారు

Prabhas, Amit Shah
Prabhas, Amit Shah
ఇటీవ‌లే టాలీవుడ్ స్టార్ ఎన్‌.టి.ఆర్‌.ను హైద‌రాబాద్ వ‌చ్చి ప్ర‌త్యేకంగా క‌లిసిన బిజెపి అగ్ర నేత అమిత్ షా ఆ త‌ర్వాత హీరో నితిన్‌ను కూడా క‌లిశారు. ఇప్పుడు తాజాగా ప్ర‌భాస్‌ను క‌ల‌వ‌నున్నారు. అందుకోసం ప్ర‌భాస్ రేపు అన‌గా 16వ తేదీన షూటింగ్‌ను విర‌మించుకుని హైద‌రాబాద్‌లో ఇంటి వ‌ద్ద‌నే వుండ‌నున్నారు. ముఖ్యంగా కృష్ణంరాజు మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న్ను క‌ల‌వాల‌నుకున్నా సాధ్య‌ప‌డ‌లేదు. అందుకే ప్ర‌త్యేకంగా రేపు అనగా 16వ తేదీ శుక్ర‌వారంనాడు క‌ల‌వ‌నున్న‌ట్లు ప్ర‌భాస్‌కు సందేశాన్ని అంద‌జేశారు.
 
బిజెపి పార్టీకి సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో భాగంగా హైద‌రాబాద్ వ‌స్తున్న అమిత్ షా ప్ర‌త్యేకంగా టైం తీసుకుని ప్ర‌భాస్‌ను క‌ల‌సి ప‌రామ‌ర్శించ‌నున్నారు. కృష్ణంరాజు ఇప్ప‌టికే బిజెపి పార్టీ కార్య‌క‌ర్త‌గా వున్నారు. మ‌ధ్య‌లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్ళారు. అది చారిత్రాత్మ‌క త‌ప్పిదంగా ఆయ‌న ఆ త‌ర్వాత వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత బిజెపిలో కొన‌సాగారు కృష్ణంరాజుగారు.  రేపు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా, అనంతరం కృష్ణంరాజు గారి ఇంటికి వెళ్లి ఆయన సతీమణి శ్యామల గారిని, హీరో ప్రభాస్ ని కలిసి నివాళులు అర్పించనున్నట్లు ప్ర‌క‌ట‌న వెల‌వ‌డింది.