26,200 వజ్రాలతో పొదిగిన ఉంగరం.. దేవ్ ముద్రిక అనే పేరుతో...
Dev Mudrika
పువ్వు ఆకారంలో ఉన్న ధగధగ మెరుస్తున్న ఈ ఉంగరానికి దేవ్ ముద్రిక అని పేరు పెట్టినట్లు సంస్థ యజమాని విపుల్ అగర్వాల్ తెలిపారు. ఇది వరకు ఓ సంస్థ 24వేల వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేసిందని చెప్పుకొచ్చారు.
తొలుత సాఫ్ట్ వేర్ ద్వారా దేవ్ ముద్రిక డిజైన్ ను రూపొందించామన్నారు. తర్వాత కళాకారులతో తయారు చేయించామని తెలిపారు. రెండు వేళ్లకు పెట్టుకునే ఈ ఉంగరం ధర ఇంకా నిర్ణయించలేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు కోసం దరఖాస్తు చేస్తామని తెలిపారు.
