సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్...

smartphone
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో చదువుకునే అమ్మాయిల ఫోటోలను సేకరించిన కొందరు పోకిరీలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు పలువురు విద్యార్థినిలు గుర్తించారు. దీంతో బాధిత విద్యార్థినిలు తమకు భయంగా ఉందంటూ ఆందోళనకు దిగడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ఘట్‌కేసర్‌లో గత రాత్రి ఈ సంఘటన జరిగింది. మండలంలోని అవుషాపూర్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు కొందరు వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. వీరిలో పలువురు పోకిరీలు ఉన్నాయి. 
 
అబ్బాయిల్లో కొందరు అమ్మాయిలు తమ వాట్సాప్ డీపీల్లో పెట్టుకున్న ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి వేరే ఫోన్ల నుంచి తమకు పంపుతున్నట్టు విద్యార్థినిలు గుర్తించారు. దీంతో బాధిత విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.