శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2022 (14:27 IST)

మావటి పంచె ఊడగొట్టిన గజరాజు.. గురువాయూర్ వీడియో వైరల్

Elephant
Elephant
కేరళలో ఓ జంట పెళ్లి వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని ప్రముఖ గురువాయూర్ ఆలయంలో ఇటీవల ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సందర్భంగా ఆ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో వీరిద్దరూ జంటగా ఉన్న దృశ్యాలను కెమెరామెన్ వీడియో తీశాడు. 
 
అలాగే గుడికి చెందిన ఏనుగు ముందు నిలబడి వీడియో కూడా తీస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన ఏనుగు తన సమీపంలోకి వచ్చిన మావటిపై తొండంతో దాడి చేసింది. దీంతో అక్కడున్న జనం భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. 
 
అంతటితో ఆగని ఏనుగు కిందపడిన మావటిని తలకిందులుగా పైకెత్తి.. మావటి పంచెను ఊడగొట్టింది. దీంతో పంచెపోయినా పర్లేదని.. ఆ మావటి ఏనుగు బారినుంచి తప్పించుకుని పారిపోయాడు. 
 
ఆపై ఏనుగుపైనున్న మావటి గజరాజును శాంతింపజేశాడు. ఈ తతంగాన్నిపెళ్లి జంటను వీడియో తీసిన కెమెరామెన్ వీడియో తీశాడు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.