బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (20:38 IST)

ఎమ్మెల్యే వెంటపడి తరిమి కొట్టిన గ్రామస్థులు.. ఎక్కడ?

bjpmla kumaraswamy
కర్నాటక రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఓ గ్రామస్థుల చేతిలో చావుదెబ్బలు తిన్నారు. ఆయనను పోలీసులు గ్రామస్థుల నుంచి చెర నుంచి రక్షించి ప్రాణాలు కాపాడారు. లేకుంటే.. సదరు ఎమ్మెల్యేకు గ్రామస్థులంతా కలిసి బడిత పూజ చేసివుండేవారు. ఇంతకు ఎమ్మెల్యేపై గ్రామస్థులు దాడి చేయడానికి గల కారణాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఏనుగుల స్వైర విహారం చేస్తున్నాయి. ఈ గజరాజులు జనవాస కేంద్రాలపై చేస్తున్న దాడుల్లో పలువురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఎనుగుల దాడుల జరుగకుండా చర్యలు తీసుకోవాలని పలు మార్లు విజ్ఞప్తి చేశారు. అటు ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఏనుగుల దాడిలో మరో మహిళ చనిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు శవంతో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న చిక్కమగళూరు ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎంపీ కుమారస్వామి తీరిగ్గా సాయంత్రానికి గ్రామానికి వచ్చారు. ఆయన్ను చూడగానే గ్రామస్థులు ఆగ్రహంతో రగిలిపోయి వాగ్వాదానికి దిగారు. ఆయన కూడా అదే స్థాయిలో స్పందించడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆయనపై దాడి చేశారు. చొక్కాను చింపివేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను రక్షించారు.