మంగళవారం, 31 జనవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 4 నవంబరు 2022 (23:13 IST)

కర్ణాటకలో చిరుతపులి.. బైకుపై వెళ్తున్నా వదల్లేదు.. మధ్యలో ఓ కుక్క.. (వీడియో)

Leopard
Leopard
కర్ణాటకలో చిరుతపులి కలకలం సృష్టించింది. కర్ణాటకలోని మైసూరు నగరంలో చిరుతపులి దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. కేఆర్ నగరంలో ప్రజలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అక్కడ చిరుతపులి కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
జనం సందడి చేయడంతో దారిలో కనిపించిన వారిపై చిరుత దాడి చేయడం ప్రారంభించింది. కొందరు డాబాపైకి వెళ్లి తప్పించుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై చిరుతపులి దాడి చేసింది. 
 
జనం తరిమి కొట్టడంతో పులి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందితో మత్తు ఇంజెక్షన్‌ వేసి చిరుతను పట్టుకున్నారు. తర్వాత దాన్ని సురక్షితంగా రక్షించి సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో చిరుతను చూసి చాలామంది పరుగులు తీస్తుంటే.. ఓ కుక్క కూడా చిరుత వెంటపడిన వేగానికి దాని నుంచి తప్పించుకుని పారిపోయింది.