ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (10:52 IST)

ఎన్.టి.ఆర్. కోసం అందరూ ఎదురుచూస్తున్నారు

NTR speech
NTR speech
ఎన్.టి.ఆర్. కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మెన్ అఫ్ మాసెస్ అంటూ అయన ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం ఏమంటే,  నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవంలో ప్రసంగం చేయనున్నారు. ఇందుకు ఎన్టీఆర్ కు ఆహ్వానం వచ్చింది.  కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం ఓ స్మరణ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమం కోసం గాను అక్కడి ప్రభుత్వం కోరిక మేరకు ఎన్టీఆర్ అయితే అతిధిగా వెళ్లనున్నారు. 
 
పునీత్ కి అలాగే ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో అయితే ఎన్టీఆర్ మాటల విషయంలో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తన కెరీర్ లో 30వ సినిమా దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే మరింత ఆలస్యం అవుతున్న కొద్దీ మరింత హైప్ పెరుగుతూ వస్తుంది.