బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (10:43 IST)

తెరాస మంత్రి జగదీష్ రెడ్డి పీఏ నివాసంలో ఐటీ సోదాలు.. రూ.4 లక్షలు స్వాధీనం

jagadish reddy
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి మంత్రి జగదీశ్‌ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్‌ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. నల్గొండ తిరుమలనగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి నివాసంలో 30 మంది సభ్యులతో కూడిన బృందం సోదాలు నిర్వహించి రూ.4 లక్షలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
 
ఆయన కారును కూడా అధికారులు సీజ్ చేశారు. అలాగే, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని మంత్రి జగదీశ్ రెడ్డి కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
 
స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
 
కాగా, ఈ నెల 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు ఐటీ అధికారులు మంత్రి జగదీష్, ఆయన పీఏ నివాసాల్లో సోదాలు చేయడం గమనార్హం.