మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (12:26 IST)

ఆర్ఎస్ బ్రదర్స్ శాఖలపై ఆదాయపన్ను పంజా

it raids
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వస్త్ర దుకాణమైన ఆర్.ఎస్.బ్రదర్స్ శాఖలపై ఆదాయపన్ను శాఖ పంజా విసిరింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభించారు. 
 
ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ బ్రాంచ్‌లతో పాటు మరికొన్ని సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 15కు పైగా బృందాలు దాడులు చేస్తున్నాయి. ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌తో పాటు మరో రెండు స్థిరాస్తి సంస్థల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.
 
గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో సీబీఐ, ఈడీ దాడులు కలకలం సృష్టించగా.. ఇప్పుడు ఐటీ శాఖ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దిల్లీ లిక్కర్‌ కుంభకోణం వ్యవహారంలో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.