శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (17:40 IST)

స్నేహితుడని ఇంట్లో ఆశ్రయమిస్తే.. భార్యను కోర్కె తీర్చమంటూ బెదిరింపు

woman victim
హైదరాబాద్ నగరంలో స్నేహం ముసుగులో ఓ వ్యక్తి తోటి మిత్రుడి భార్యపై కన్నేశాడు. తన కోర్కె తీర్చాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ తన భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ నగరానికి చెందిన అబ్దుల్‌ సల్మాన్‌ అనే వ్యక్తికి ఓ స్నేహితుడు ఉన్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా తన ఇంట్లోనే సల్మాన్‌కు మిత్రుడు ఆశ్రయమిచ్చాడు. అయితే, సల్మాన్‌ రహస్య కెమెరా ద్వారా తన మిత్రుడు భార్యతో ఉండగా ఆ దృశ్యాలు చిత్రీకరించాడు. 
 
వాటిని మిత్రుడి భార్యకు చూపి తన కోరిక తీర్చమని వేధించసాగాడు. లేకపోతే చిత్రీకరించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు షీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.