ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (11:24 IST)

దేశంలో వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు

gold
దేశంలో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. మంగళవారంతో పోల్చుకుంటే ఈ ధర తగ్గుదల రూ.70 మేరకు ఉంది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధరపై ఈ తగ్గుదల కనిపించింది. గ్రాము బంగారం ధర బుధవారం రూ.4,690గా ఉండగా, 10 గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉంది. మంగళవారం, బుధవారం కలిపి దాదాపు గ్రాముకు బంగారం ధర రూ.90 తగ్గినట్లయింది. 
 
ఈ బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.4,690గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.77 మేర తగ్గింది. గ్రాము బంగారం ధర రూ.5,116గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 
 
అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో కూడా 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.4,705గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.47,050గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.5,133గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.51,330గా ఉంది.
 
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,690గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.5,116గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది.