గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (18:52 IST)

బంగారంతో పోటీపడే పులస.. రూ.17వేలకు కొనుగోలు

pulasa fish
గోదావరి నదిలో దొరికే అత్యంత అరుదైన చేప పులస. ఈ పులస చేప రుచే రుచి. అత్యంత అరుదుగా లభించే ఈ పులస చేప ధర నిజం చెప్పాలంటే బంగారంతో పోటీపడుతుంది. 
 
తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం కేదార్లంక వద్ద గోదావరిలో ఓ మత్స్యకారుడు సందాడి సత్యనారాయణ వలలో పులస చేప పడింది. వేటాడే సమయంలో వలకు చిక్కిన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో పులస చనిపోతుంది. 
 
అయితే ఓ మత్స్యకారుడికి దొరికిన పులస మాత్రం చాలాసేపటి వరకు ప్రాణాలతో ఉంది. దాంతో పులసను పట్టుకున్న మత్స్యకారుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కిలో బరువున్న ఈ పులసను పెదపట్నం లంకకు చెందిన నల్లి రాంప్రసాద్ రూ. 17 వేలకు కొనుగోలు చేశారు.