గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (20:06 IST)

శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలనులోని శాకాహార మొసలి మృతి

vegetarian crocodile
vegetarian crocodile
శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని శాకాహార మొసలి మరణించింది. ఒంటరి శాకాహారం మాత్రం తీసుకునే ఈ మొసలి దశాబ్దాల నాటిది. ఇది అనంత పద్మనాభ స్వామి ఆలయ సరస్సులో నివసిస్తుంది. తరచుగా మైదానంలో తిరుగుతూ కనిపించింది. ఆదివారం అర్థరాత్రి చనిపోయినట్లు కనుగొనబడింది.
 
సుమారు 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న శాకాహారం తిన్న మొసలి ఈ బాబియా కన్నుమూసింది. ఆలయ అధికారుల ప్రకారం, ఈ మొసలి ఆలయాన్ని కాపలాగా ఉన్నది.
 
అలాగే శ్రీ అనంతపద్మనాభ స్వామి అన్నం, బెల్లం ప్రసాదాన్ని తీసుకుంటూ ఆలయంలోని సరస్సులో నివసించేది. సాధారణంగా మాంసాహార జంతువును దైవంగా విశ్వసించే వారికి, మొసలి ప్రధాన ఆకర్షణగా ఉండేది.