గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

మెగా ఈవెంట్‌కు ట్రయల్ - నేటి నుంచి సఫారీలతో భారత్ ఢీ

rohit sharma
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా ఈవెంట్ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. దీనికి సన్నాహకంగా భావించే సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య టీ20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లూ తిరువనంతపురానికి చేరుకున్నాయి. స్థానిక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. 
 
ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ అక్టోబరు 2వ తేదీన అస్సోం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహిస్తారు. ఆ తర్వాత చివరి టీ20 మ్యాచ్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ వేదికగా జరుగుతుంది. 
 
కాగా, ఇటీవల పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని మంచి ఊపుమీదుంది. సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌లలో కూడా తమ సత్తా చాటాలని భారత క్రికెటర్లు గట్టిపట్టుదలతో ఉన్నారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ జట్టు ఆస్ట్రేలియా దేశానికి బ
యలుదేరి వెళుతుంది.