గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (11:36 IST)

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్

supreme court
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయ లలిత్ తన వారసుడిని ఎంపిక చేశారు. తన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ పేరును ఆయన నామినేట్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాశారు. ఈ లేఖను ఆయన మంగళవారం అందజేయనున్నారు. 
 
అన్ని అంశాలను పరిశీలించి తదుపరి కొత్త చీఫ్ జస్టిస్‌గా చంద్రచూడ్ పేరును ఆయన సిఫార్సు చేశారు. లలిత్ తన వారసుడి కోసం ఆచారబద్ధంగా సిఫార్సు లేఖను అందజేయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తలు భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత ఆయన కేంద్రానికి ఈ లేఖను అందజేస్తారు. 
 
కాగా అన్నీ సక్రమంగా జరిగితే యుయు లలిత్ తర్వాత భారత సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరిస్తారు.