సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (16:55 IST)

లాయర్ల ఫీజు చెల్లింపులో ఉన్న శ్రద్ధ పర్యావరణ పరిరక్షణపై లేదు : ఏపీపై సుప్రీం ఫైర్

supreme court
లాయర్లకు ఫీజు చెల్లింపులపై ఉన్న శ్రద్ధ పర్యావరణ పరిరక్షణపై కనిపించడం లేదంటూ ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పైగా, ఒక కేసుకు ఎంతమంది సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేస్తారంటూ సూటిగా ప్రశ్నించింది. పైగా, లాయర్లకు ఎంతెంత ఫీజు చెల్లించారో తెలుసుకునేందుకు ప్రభుత్వానికి నోటీసులు జారీచేస్తామని జస్టిస్ రస్తోగి, జస్టిస్ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
 
ఏపీలో పలు ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి అపార నష్టం జరిగిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్.జి.టి) ప్రిన్సిపల్ బెంచ్ ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్ల మేరకు జరిమానా విధించింది. ఈ తీర్పును నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
 
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టాన్ని ప్ర‌భుత్వం ఎందుకు భ‌రించ‌దని కోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ఈ ఒక్క కేసు విచార‌ణ‌కు ఎంత‌మంది సీనియ‌ర్ లాయ‌ర్ల‌ను ఎంగేజ్ చేస్తార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది. 
 
ఈ కేసులో లాయ‌ర్ల‌కు ఎంత ఫీజు చెల్లించారో తెలుసుకునేందుకు నోటీసులు జారీ చేస్తామ‌ని కోర్టు వ్యాఖ్యానించింది. లాయ‌ర్ల‌కు ఫీజు చెల్లింపులో ఉన్న శ్ర‌ద్ధ‌.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై క‌నిపించ‌డం లేద‌ని వ్యాఖ్యానించింది.
 
ఈ సంద‌ర్భంగా ప్ర‌తివాదుల త‌ర‌పు న్యాయ‌వాది క‌ల్పించుకుని ఇప్ప‌టికీ ప‌ర్యావ‌ర‌ణ ఉల్లంఘ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని కోర్టుకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా తిరిగి క‌ల్పించుకున్న బెంచ్‌.. ఎన్జీటీ తీర్పుల‌పై దాఖ‌లైన అన్ని పిటిష‌న్ల‌ను ఒకేసారి విచారిస్తామ‌ని వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే కేసు విచార‌ణ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు ప్ర‌క‌టించింది.