గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (15:16 IST)

లక్ష్మీపార్వతికి షాక్ - చంద్రబాబు ఖుషీ .. ఎందుకంటే...

lakshmi parvathi
వైకాపా మహిళా నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడామీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణకు ఆదేశించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతికి కోర్టు ఘాటుగా కొన్ని ప్రశ్నలు సంధించింది. అస్సలు చంద్రబాబు ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి మీరెవరూ అంటూ సూటిగా ప్రశ్నించింది. 
 
గతంలో ఇదే పిటిషన్‌ రాష్ట్ర హైకోర్టులో తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇపుడు సుప్రీం బెంచ్ విచారణ చేపట్టి ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. అప్పట్లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిటిషన్‌లో లక్ష్మీపార్వతి ప్రస్తావించిన అంశానికి విలువ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అసలు ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరంటూ ప్రశ్నించింది. ఎవరి ఆస్తుల వివరాలు ఎవరికి తెలియాలి? అంటూ నిలదీసింది.