శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (12:55 IST)

ఎన్నికల్లో ఈవీఎంలను నిషేధించాలన్న పిటిషన్‌ను తోసేసిన సుప్రీం

dummy evms
దేశంలో జరిగే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)లను వినియోగించకుండా నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం ససేమిరాంది. సీనియర్ న్యాయవాది జయ సుకిన దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండానే తోసిపుచ్చింది. 
 
వచ్చే 2024లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను వినియోగించేలా భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుకిన్ తన పిటిషన్‌లో కోరారు. 
 
ముఖ్యంగా, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి పలు దేశాల్లో ఈవీఎంలను పక్కనబెట్టేసి బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. 
 
అదేసమయంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పాదుగొల్పేలా ఎన్నికల ప్రక్రియలో బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. అయితే, ఈ పిటిషన్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన అపెక్స్ ధర్మాసనం, విచారణకు స్వీకరించకుండానే తోసిపుచ్చింది.