మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (18:14 IST)

హిజాబ్ ఎత్తివేత: కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

hijab row
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని వేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
 
ఈ నేపథ్యంలో ఆ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ హేమంత గుప్తా, సుధాన్షు దులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. 
 
హిజాబ్ బ్యాన్ ఎత్తివేత అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మళ్లీ సెప్టెంబర్ 5వ తేదీన విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.