గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (11:15 IST)

నేడు తెలంగాణాలో టీఎస్ ఐసెట్ 2022 రిలీజ్

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఐసెట్ 2022 పరీక్షా ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, కేయూ వీసీ ప్రొఫెసర్ రమేష్ విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల కోసం https://icet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.
 
వరంగల్‌లోని కాకతీయ యూనివర్శీటీ ఆధ్వర్యంలో ఐసెట్ 2022 పరీక్షను గత జూలై 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించింది. దీనికి సంబంధించిన ఆన్సర్‌ కీ ఆగస్టు 4వ తేదీన విడుదల చేశారు. ఆన్సర్ కీ పై తమ అభ్యంతరాలను లేవనెత్తడానికి కూడా యూనివర్శిటీ అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ అంతా ముగిసిపోవడంతో తుది ఆన్సర్ కీ అంటే పరీక్షా ఫలితాలను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.