శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (15:14 IST)

బిల్కిస్ బానో అత్యాచార కేసు నిందితుల విడుదల : సుప్రీంకోర్టు నోటీసులు

supreme court
బిల్కిస్ బానో అత్యాచార కేసులోని దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి యేటా సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తుంటాయి. అలాగే, గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషులను విడుదల చేసింది. పైగా జైలు నుంచి విడుదలైన వారిని ఘనంగా సన్మానించి ఊరేగింపు చేశారు. ఈ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం అనేక సందేహాలను వ్యక్తం చేసింది. అన్నీ ఆలోచించే వారికి క్షమాభిక్ష ఇచ్చారా? అని తెలుసుకోవాలుందన్నారు. అలాగే రిమిషన్ పాలసీ ప్రకారం విడుదల చేయడం సమర్థనీయమా? అన్నదే అసలు ప్రశ్న అని చెప్పారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో జస్టిస్ రస్తోగి కల్పించుకుని పలు సందేహాలను వ్యక్తంచేశారు. అలాగే, జస్టిస్ ఎన్వీ రమణ కల్పించుకుని క్షమాభిక్ష కోసం దరఖాస్తు మాత్రమే దాఖలు చేయొచ్చని కోర్టు ఆదేశింసే, దోషుల విడుదలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని బయట ప్రచారం జరుగుతోందని గుర్తుచేశారు. అలాగే, ఈ కేసులో విడుదలైన దోషులందరినీ ఒక పార్టీ సభ్యులుగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.