గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (13:54 IST)

నాని, కీర్తి సురేష్‌ల దసరా.. లుక్ అదిరింది..

Nani
Nani
నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'దసరా'. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తాజాగా మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక దసరా సినిమా రిలీజ్ డేట్‌తో పాటు, ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ రిలీజ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో నాని మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. 
 
చెదిరిపోయిన రింగుల జుట్టు, మాసిపోయిన బట్టలు, దుమ్ముతో నిండిన శరీరంతో ఉన్న నాని ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకునేదిగా ఉంది. దీంతో పాటు చేతిలో ఉన్న మద్యం సీసా అతని మొరటుతనాన్ని తెలియజేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకప్పటి పాపులర్ స్టార్ హీరోయిన్ సిల్క్ స్మిత తన గోళ్లు కొరికే చిత్రం ఉండడాన్ని గమనించవచ్చు.
 
దర్శకుడు శ్రీకాంత్ ఓడెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తుండగా మేకర్స్ అయితే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్‌తో శరవేగంగా తెరకెక్కిస్తున్నారు.