బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 ఆగస్టు 2022 (20:51 IST)

స్ప్రైట్ కొత్త క్యాంపెయిన్, ఏంటది?

Nani
కోకా-కోలా వారిచే ఇండియా యొక్క అభిమాన నిమ్మ మరియు నిమ్మ-రుచి గల పానీయం స్ప్రైట్, శాంతపరచే మరియు చల్లబరచే అనుభవం కోసం వెళ్ళగల తాజా పానీయముగా తన స్థితిని సుస్థిరపరచుకోవడానికి ఒక కొత్త క్యాంపెయిన్‌ని వెల్లడించింది.  ఈ సంవత్సరం ప్రథమార్ధములో కోకా-కోలా ఇండియా కొరకు మొత్తం-మీద వాల్యూము - ఆధారిత ఎదుగుదలకు స్ప్రైట్ అతిపెద్ద దోహదకారిగా ఉండింది. ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు దీనిని తమ #1 ఎంపికగా చెబుతూ ఇది ఇండియా యొక్క అత్యంత ప్రీతిపాత్రమైన మృదు పానీయముగా ఉండటంతో పాటుగా అదనంగా, కంపెనీ యొక్క ఇండియా విభాగములో అత్యధిక ఇంటివాడుక బ్రాండుగా కూడా ఉంటోంది. 

 
ఈ కొత్త క్యాంపెయిన్, ఓటీటీ కంటెంటును వీక్షించే అభిరుచి అంశాన్ని పరపతిగా చేసుకొని - తాము విరామం కోరుకున్నప్పుడు తమకు ఇష్టమైన ఎంపికగా స్ప్రైట్‌తో తమ అభిమాన ప్రదర్శన లేదా సినిమా వీక్షించే వినియోగదారులతో అనుసంధానం కావడం లక్ష్యంగా చేసుకొంది. ఈ క్యాంపెయిన్, తన చేరువ మరియు వినియోగదారు నిమ్నగ్నతను సానుకూలం చేసుకోవడానికి టెలివిజన్, డిజిటల్, ప్రింట్ అదేవిధంగా OOH యాక్టివేషన్లతో సహా అనేక టచ్-పాయింట్లను సద్వినియోగం చేసుకుంటూ 360-డిగ్రీ మార్కెటింగ్ విధానాన్ని అలవరచుకుంటుంది. స్ప్రైట్ ఈ క్యాంపెయిన్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’తో భాగస్వామ్యం కుదుర్చుకొంది. దీనికి అదనంగా, ఈ చిత్రంలో తన అభిమానులచే "సహజ నటుడు” గా పిలిపించుకునే తెలుగు సూపర్ స్టార్ నాని నటించారు. అటువంటి అధిక-వేడిమి అయిన పాత్రల యొక్క హాస్యభరితమైన అతిశయోక్తి స్పందన యొక్క ఈ ప్రకటన, శీతలమైన స్ప్రైట్ తీసుకున్న తర్వాత శాంతముతో, చల్లబడిన మనస్సుతో తేలికపడుతుంది.
 
కొత్త క్యాంపెయిన్ గురించి వ్యాఖ్యానిస్తూ, కోకా-కోలా INSWA, స్పార్క్లింగ్ ఫ్లేవర్స్ కేటగరీ, సీనియర్ డైరెక్టర్ టిష్ కాండెనో గారు, “20 సంవత్సరాలకు పైగా, స్ప్రైట్ తనకు తానుగా వివాదరహితమైన యువత బ్రాండుగా పేరు పొందడమే కాకుండా, తన మార్కెటింగ్ ప్రయత్నాల ద్వారా అధీకృత, పదునైన మరియు పట్టణ సంభాషణల్లో కూడా ఆధిపత్యం చెలాయిస్తోంది. స్ప్రైట్ యొక్క వేసవి క్యాంపెయిన్ “థండ్ రఖ్ (చల్లగా ఉంచండి)” యొక్క విజయంపై స్ఫూర్తిని పొంది, మా కొత్త చిత్రం, మీ ఆటవిడుపు సందర్భాలు మరియు వారాంతాలన్నింటికీ ఛిల్డ్ స్ప్రైట్ యొక్క ఒక బాటిల్ ఎలా కచ్చితమైన భాగస్వామి అవుతుందో ప్రదర్శించి చూపడానికి ఒక చమత్కారమైన విధానాన్ని అనుసరిస్తుంది. తేలిక-హృదయం గల హాస్యప్రియుడు బ్రాండ్ యొక్క ‘ తాజాదనం కలిగించే పానీయం తీసుకోండి, అది అప్పటికప్పుడే మీ భావనను తేలికపరుస్తుంది’  అనే మూల సందేశాన్ని పునరుద్ఘాటించడాన్ని ఈ క్యాంపెయిన్ చిత్రీకరిస్తుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రముఖ తారలలో ఒకరు, మరియు విస్తృతంగా అభిమానించబడుతున్న నాని గారితో భాగస్వామ్యం వహిస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము మరియు వినియోగదారులతో అనుసంధానతను పెంపొందించుకోవడానికి ఇది తదుపరి మాకు సహాయపడుతుంది” అన్నారు.
 
స్ప్రైట్ (Sprite) యొక్క కొత్త క్యాంపెయిన్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, తెలుగు సూపర్ స్టార్ నాని, ఇలా అన్నారు, “స్ప్రైట్ (Sprite) చేసినట్టుగా మిమ్మల్ని శాంతపరచే పానీయం మరొకటి లేదు. తీరికలేని షెడ్యూళ్ళతో సతమతమవుతున్న కళాకారుడిగా ఉన్నప్పటికీ కూడా, స్ప్రైట్ నాకు ఎల్లప్పుడూ తాజాదనపు ఎంపికగా ఉంటూ వస్తోంది. బ్రాండ్ యొక్క కొత్త క్యాంపెయిన్ లో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను” అన్నారు.